ఉక్రెయిన్‌లోని మేరియుపోల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించారు. పూర్తిగా నాశనమైన మేరియుపోల్‌ను పుతిన్ ఆకస్మికంగా సందర్శించారు. మేరియుపోల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లిన పుతిన్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. అక్కడక్కడా ఆగుతూ స్థానిక ప్రజలతో మాట్లాడారు. కాగా రష్యా ఆక్రమించిన క్రిమియాలో కూడా పుతిన్ పర్యటించారు. ఈ సందర్భంగా బాలల కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో క్రిమియాలోని బాలలను అక్రమంగా తరలించారంటూ ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.