తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. సింగపూర్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో జపాన్‌కు చెందిన సైనా కవాకమిని 21-15, 21-7 తేడాతో ఓడించింది. కేవలం 31 నిమిషాల్లో ఓడించడం విశేషం. ఇక ఫైనల్ పోరు రేపు (జూలై 17న) జరగనుంది. ఫైనల్స్‌లో సింధు జపాన్‌కు చెందిన అయా ఒహోరి లేదా చైనాకు చెందిన వాంగ్ జియితో ఆడనుంది.
సింగపూర్ ఓపెన్ 2022లో ఫైనల్స్ చేరిన పీవీ సింధు

Screengrab Twitter: