కొరియా ఓపెన్ నుంచి సింధు అవుట్

కొరియా ఓపెన్ వరల్డ్ బాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. సెమి ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన అన్ సియోంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో 21-14, 21-17 తేడాతో ఓటమి చెందింది. దీంతో సింధు టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21-10, 21-16 తేడాతో బుసానన్‌‌పై 17వ సారి విజయం సాధించిన విషయం తెలిసింది.

Exit mobile version