ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2022 టోర్నమెంట్‌కు ఖతార్ సిద్దమవుతుంది. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా, ఖతార్ మాత్రం టోర్నమెంట్‌కు ప్రిపేర్ అవుతుంది. అయితే యుద్ధం కారణంగా ప్రపంచ కప్ నుంచి రష్యాను ఫిఫా తొలగించింది. దీంతో ఫిఫా కౌంట్‌డౌన్ గడియారం దగ్గర నుంచి రష్యా జెండాను తొలగించారు. కాగా ఈ ప్రపంచ కప్ ఈ ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు జరగనుంది.