క్వాడ్ గ్రూప్ దేశాలు గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇరు దేశాలు శాంతి చర్చలతో సమస్యలను పరిష్కరించుకునేలా, దౌత్యపరమైన సంబంధాలు మెరుగయ్యేలా అందరం సహాయసాకారాలు అందించాలని కోరారు. అలాగే ఇండో- ఫసిపిక్ ప్రాంతాల్లో చోటుచేసుకున్న అంశాలపై సభ్య దేశాలు చర్చించాయి. ఈ ఏడాది చివరిలో జపాన్‌లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్, జపాన్ ప్రధాని కిషిడ పాల్గొన్నారు.