చైనాలో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం అవలంబిస్తున్న జీరో కొవిడ్ విధానంపై దేశ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంక్షల పేరిట లక్షల మందిని ఇళ్లకే పరిమితం చేయడంపై వారు మండిపడుతున్నారు. పూట గడవక ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్ కారణంగా సరైన వైద్యం అందక ఇటీవల ఓ మూడేళ్ల చిన్నారి చనిపోయింది. ఆ ఘటన మరువక ముందే మరో నాలుగు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో చైనా వాసులు ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
చిన్నారుల ప్రాణం మీదకు క్వారంటైన్

© Envato(representational)