వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం పంపించి పరీక్ష నిర్వహించిన విచిత్ర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి 20 మార్కులు ఉంటాయి. అయితే కాలేజీలో ప్రింటర్ పనిచేయకపోవడంతో… వాట్సాప్‌లో అందరికీ ప్రశ్నాపత్రం పంపించారు. కాపీ కొట్టకుండా ఆరుబయటే పరీక్ష రాయించామని ప్రిన్సిపల్ చెప్పారు.