ప్రభాస్-పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఈ సినిమాలోని పాటలు మాత్రం మంచి మార్కులు కొట్టేశాయి. అందులో ప్రత్యేకంగా ‘ఈ రాతలే’ పాట ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పూజ, ప్రభాస్ మధ్య ఎంతో అందంగా సాగే ఈ పాటను మీరు కూడా చూసేయండి.