ప్రభాస్, పూజ హెగ్దే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘రాధేశ్యామ్’. ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్లు సినిమాపై ఉన్న అంచనాలను మరింత ఎక్కువ చేశాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలు రికార్డు స్థాయిలో ప్రదర్శితం కానున్నట్లు తెలుస్తోంది. కేవలం ప్రీమియర్ షోలతోనే సినిమా $1 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది. అదే నిజమైతే బాహుబలి తరువాత కేవలం ప్రీమియర్ షోలతో $1 మిలియన్ మార్కును అందుకున్న సినిమా ‘రాధేశ్యామ్’ అవుతుంది.