‘రాధే శ్యామ్’ మూవీకి భిన్నమైన టాక్ వినిపించినప్పటికీ కలెక్షన్లలో మాత్రం దూసుకెళ్తుంది. మార్చి 11న విడుదలైన సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల కలెక్షన్లు సాధించింది. 2022 లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. రాధేశ్యామ్‌లో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తముద్రికా నిపుణుడి పాత్రలో నటించాడు. పూజా హెగ్డే డాక్టర్‌గా నటించింది.