అసురన్, వడా చెన్నై, వాడివాసల్, విడుతలై వంటి సెన్సేషనల్ సినిమాల దర్శకుడు వెట్రిమారన్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ బుధవారం వచ్చే అవకాశముంది. విడుతలై2 ఆడియో లాంచ్‌లో ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. RS ఇన్ఫోటైన్‌మెంట్ సినిమాను నిర్మించనుంది.