ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2022 ఈవెంట్ ఫైనల్లో రాఫెల్ నాదల్(36) అదరగొట్టాడు. నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను ఓడించి నాదల్ రికార్డు స్థాయిలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫైనల్స్‌లో నాదల్ తన ప్రత్యర్థి రూడ్‌ను 6-3, 6-3, 6-0 తేడాతో ఓడించి 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అత్యంత వయస్కుడు కూడా నాదల్ కావడం విశేషం. 2005లో 19 ఏళ్ల వయస్సులో నాదల్ తన మొదటి ఫ్రెంచ్ ఓపెన్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.