‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఘాటుగా స్పందించారు. తెలుగు సినిమాకు, సాహిత్యానికి, దర్శకుడికి, నటులకు వస్తున్న స్పందన చూసి గర్వపడాలని సూచించారు. ‘రూ.80కోట్లు ఖర్చు చేశారంటూ చెప్పడానికి నీ దగ్గరేమైనా లెక్కలున్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటివారు డబ్బులు తీసుకుని పొగిడారని మీ ఉద్దేశమా?’ అంటూ భరద్వాజకి కౌంటర్ ఇచ్చారు. ఆస్కార్ ప్రమోషన్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని, ఈ మొత్తంతో 7,8 చిన్న సినిమాలు తీయొచ్చని భరద్వాజ వ్యాఖ్యలు చేశారు.