టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ఇంట్లో విషాధం నెలకొంది. ఆయన తండ్రి లక్ష్మీ నారాయణరావు(94) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు రఘు కుంచే తెలిపారు. ”నానాన్న కాలం చేయటానికి కొన్ని గంటల ముందు, నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని ఫ్యామిలీతో ఉల్లాసంగా గడిపి.. దూరంగా ఉన్నవాళ్లను వీడియో కాల్లో పలకరించారు.తనకు ఇష్టమైన మడత కుర్చీలో వెనక్కివాలి తన ప్రాణానికి ప్రాణమైన భగవద్గీత చదవుతూ అలానే శాశ్వత నిద్రలోకి జారిపోయారు. ఎవరిని ఇబ్బంది పెట్టని నాన్న చివరి క్షణాల్లోనూ అలానే వెళ్లిపోయారు. మిస్ యు నాన్న” అంటూ రఘు కుంటే ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రఘు కుంచె తండ్రి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
-
Courtesy Twitter: raghu kunche
-
Courtesy Twitter: raghu kunche