గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్ విద్యార్థులు వేధింపులు చేస్తున్నారు. దీంతో జాతీయ మెడికల్ కమిషన్‌ను ఆ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మెడికల్ కమిషన్, ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరింది. ర్యాగింగ్ ఘటనపై విచారణ కమిటీ విచారణ చేపడుతుందని, మరి కొద్దీ సేపట్లో రిపోర్ట్ అందజేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.