కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రజల్లోకి వెళ్తుందని నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా గాంధీ, చైనా దురాక్రమణ, సినిమా, రాజకీయాలు తదితరాలపై ఇరువురు నేతలు చర్చించారు. ‘నాకు చిన్నప్పుడు గాంధీ అంటే పడదు. 25ఏళ్లు వచ్చాక క్రమంగా గాంధీకి అభిమానిగా మారిపోయా. అందుకే హై రామ్ అనే సినిమా తీశా. అన్ని వర్గాలతో కలిసిన సమాజమే అభివృద్ధి సాధిస్తుంది. భారత్ జోడో యాత్ర ప్రజలకు చేరువవుతోంది’ అని కమల్ హాసన్ వెల్లడించారు. పొరుగు దేశాల విషయంలో చైనా, రష్యా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.