టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టిల వివాహం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో తనకు సెలవు కావాలని రాహుల్ బీసీసీఐని కోరాడు. దీంతో శ్రీలంకతో వన్డే, టీ20 సీరీస్‌లకు రాహుల్‌ను ఎంపిక చేయలేదు. జనవరిలోనే వీరి పెళ్లి ఖాయమైనట్లే. కాగా అతియాతో రాహుల్ మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. రాహుల్‌కు జర్మనీలో ఆపరేషన్ జరిగినప్పుడు అతియా దగ్గరుండి మరీ అతని బాగోగులు చూసుకుంది.