వచ్చే ఏడాది జరిగే శ్రీలంక సిరీస్కు టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో రాహుల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ గతకొద్ది కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి కూడా పెద్దలు ఒకే చెప్పడంతో జనవరి మొదటి వారంలో ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి కూడా రాహుల్ అనుమతి తీసుకున్నాడట. దీంతో సొంతగడ్డపై జరిగే శ్రీలంక సిరీస్కు రాహుల్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
శ్రీలంక సిరీస్కు రాహుల్ దూరం!

© ANI Photo