రాహుల్ ద్రవిడ్ అర్థ సెంచరీ కొట్టాడు. రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే కోచ్‌గా చేస్తున్న వ్యక్తి హాఫ్ సెంచరీ కొట్టడమేంటి అనుకుంటున్నారా ? ఇవాళ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన కెరీర్లో ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ది వాల్. 2001లో ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితిలో వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్‌లో 180 పరుగులు సాధించాడు మిస్టర్ డిపెండబుల్. 164 టెస్టులు, 344 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడారు.