తెలంగాణలో ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడానని, చేనేత, మహిళల సమస్యలపై చర్చించామన్నారు. రాహుల్ గాంధీ పప్పు కాదని సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని కేవలం సమస్యలు నెరవేర్చడమే లక్ష్యంగా పోరాడతానన్నారు. తన తల్లి కూడా చేనేత వస్త్రాలనే కడుతుందన్న రాహుల్.. అమ్మ, చెల్లిని ఓ సారి కలవాలని పూనమ్‌కు సూచించారు.