• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫైనల్ మ్యాచ్‌లో రాహుల్‌కి చోటివ్వాలి: గవాస్కర్

    వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో కేఎల్ రాహుల్‌కి చోటు ఇవ్వాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కేఎల్‌ని ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘బ్యాటింగ్‌లో 5, 6 స్థానాల్లో రాహుల్ రాణించగలడు. గతేడాది లార్డ్స్‌లో కేఎల్ సెంచరీ చేశాడు. రాహుల్ చేరికతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడుతుంది’ అని సన్నీ చెప్పాడు. ఫామ్ లేమి కారణంగా రాహుల్‌ని చివరి రెండు టెస్టుల్లో ఆడించలేదు. అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న కేఎస్ భరత్ విఫలం కావడంతో కేఎల్ రాహుల్‌కి ఛాన్స్ ఇవ్వాలని గవాస్కర్ సూచించాడు. జూన్ 7-11 వరకు ఫైనల్ జరగనుంది.