జమ్ము కశ్మీర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న క్రమంలో వరుస బాంబు దాడులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. జమ్ములోని నర్వామాలో ఈ ఘటన జరిగింది. జంట బాంబు పేలుళ్లు జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాహుల్ పాదయాత్ర జరిగే రూట్లో పకడ్బందీగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బాంబు పేలుళ్లలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరిలించారు. అయితే, పేలుళ్ల వెనుక ఉద్దేశమేంటని ఇంకా తెలియరాలేదు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి.