చాలా మంది రైలు టికెట్ బుక్ చేసుకున్నాకా.. ఏదొక కారణం వల్ల ముందు అనుకున్న రోజు కాకుండా వెరే రోజుకు ప్రయాణం వాయిదా వేసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు రైల్వే శాఖ క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేస్తూ ఉంటుంది. అయితే క్యాన్సిలేషన్ ఫీజు కోల్పోకుండా.. మన టికెట్‌ను మరో రోజుకు షెడ్యూల్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి ఛార్జీల చెల్లించాల్సిన పనిలేదు. ప్రయాణానికి 48గంటల ముందు ప్రయాణం వివరాలు టికెట్ ఉద్యోగులకు తెలిపి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. బెర్త్‌ను సైతం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.