మొదటి మ్యాచులో ఓడిపోయి చతికిలపడిపోయిన టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్. బరాబతి స్టేడియంలో జరిగే రెండో మ్యాచులోనైనా సఫారీల మీద గెలవాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియాకు వరణుడి రూపంలో ఎదురు దెబ్బ తగలనుంది. ఈ మ్యాచ్ కు వరణుడు అడ్డు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలియజేశారు. బరాబతి స్టేడియంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మొదటి మ్యాచులో 200+ స్కోరు చేసినా కానీ టీమిండియా గెలవకలేకపోయింది.