శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొమెరిన్ తీరం దిశగా వచ్చినట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. సోమ, మంగళ, బుధవారాల వరకు ఏపీలో వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా వాయుగుండం ఎఫెక్ట్‌తో ఆదివారం రాత్రి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.