ఈనెల 13వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే భాగ్యనగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మిగిలిన జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో వర్షాల రాక ఆలస్యమవుతోందని వెల్లడించింది.