ఏపీలో నేటి నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు పడనున్నట్లు తెలిపింది. దీంతో కోస్తాతోపాటు రాయలసీమలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే సోమవారం ఏపీలోని అనేక ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
ఏపీలో 3 రోజులు వర్షాలు

© File Photo