ఏపీలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఉత్తరకోస్తాలు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా వ్యాపించడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.