దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 18న భారీగా ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లోఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం బంగాళఖాతంలో వాయుగుండంగా మారి వానలు కురుస్తాయని వివరించింది.
కోస్తా, రాయలసీమలో వర్షాలు

© Envato