వ్యోమగామి రాజాచారి స్పేస్ వాక్ చేసిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారతీయ మూలాలు ఉన్న ఇతను అమెరికాలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు తెలంగాణలోని మహబూబ్ నగర్‌కి చెందిన వారు కావడం గమనార్హం. స్పేస్ రీసెర్చ్‌లో భాగంగా రాజాచారి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి రోదసిలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదున్నర గంటలు స్పేస్ వాక్ చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు.