కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డార. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు, పదవులు ఇచ్చిందని అలాంటి పార్టీ మోసం చేశారని ఆరోపించారు. ఈడీ విచారణతో బీజేపీ సోనియా గాంధీని వేధిస్తుంటే అండగా ఉండాల్సింది పోయి, శత్రువుతో కాంట్రాక్టు మాట్లాడుకున్నారని విమర్శించారు. పార్టీకి నష్టం చేస్తే ఊరుకోమన్న ఆయన.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు.