ఎమ్మెల్యే రాజయ్య తనపై వస్తున్న వేధింపుల గురించి మాట్లాడేందుకు నేరుగా ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. రెండ్రోజుల క్రితం రాజయ్య లైంగికంగా వేధించేందుకు ప్రయత్నిస్తునారని ఆరోపించారు. తనకు డబ్బులు ఇస్తున్నానని చెప్పారంటూ విమర్శించారు. వీటిని రాజయ్య కొట్టిపారేసి వాటి గురించి ఆమెతో మాట్లాడేందుకు నేరుగా ఇంటికి వెళ్లారు. గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని నవ్య భర్త తెలిపారు.