కర్ణాటకలో నిన్న ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల విషయంలో కొత్త జీఓ తెచ్చినప్పుడు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో ధరలు పెరిగేందుకు కృషిచేశాడు. అందుకోసం చాలామందితో చాలా మాటలు పడ్డాడు. అందుకే ఆయన నిజమైన మెగాస్టార్. ఇండస్ట్రీ పెద్ద అనడం చిరంజీవికి ఇష్టం ఉండదు కానీ, నాకు మాత్రం అతడే ఇండస్ట్రీ పెద్ద అని రాజమౌళి చెప్పాడు.