• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి

    దర్శకధీరుడు రాజమౌళిని కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించినట్లు ఆ జిల్లా పాలనాధికారి చంద్రశేఖర్‌ నాయక్‌ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు రాజమౌళితో చైతన్యపర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజమౌళి పేరు సిఫార్సు చేశామన్నారు. ఈ ప్రతిపాదనను రాజమౌళి ఆమోదించారని వివరించారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలో జన్మించిన రాజమౌళి ప్రచారంతో జిల్లాలో పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.