RRR తర్వాత రాజమౌళి మహేశ్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది కూడా మల్టీస్టారర్ అని వార్తలు వచ్చిన నేపథ్యంలో అది నిజం కాదని స్పష్టం చేశాడు జక్కన్న. మహేశ్ బాబు ఒక్కడే లీడ్ రోల్లో నటిస్తాడని చెప్పాడు. ఇక ఇది రాజమౌళి అన్ని సినిమాల్లా భారీ బడ్జెట్ సినిమా కాదని తెలుస్తుంది. మరోవైపు ఎక్కువ సమయం తీసుకోకుండా ఏడాదిలో పూర్తిచేసేలా సన్నాహాలు చేస్తున్నారట.