స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్కు వచ్చారు. RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల్లోనూ RRR సత్తా చాటుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.