• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్కార్ అనంతరం రాజమౌళి తొలి రియాక్షన్

    ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ అవార్డు రావడంపై డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ట్విటర్ వేదికగా తొలిసారి స్పందించారు. ‘జై హింద్’ అని రాసి భారత మువ్వన్నెల పతాకం ఐకాన్‌ని జత చేశారు. భారత కీర్తిని, భారతీయ సినిమా గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కంకణం కట్టుకున్న జక్కన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అదే తపనతో విదేశీ వేదికల్లో ‘జైహింద్’ అని నినదిస్తూ వచ్చారు. అవార్డులు అందుకున్న చోట మాట్లాడాల్సిన అవకాశం వస్తే ‘మేరా భారత్ మహాన్’, ‘జైహింద్’ అనేవారు. ఇప్పుడు ఆస్కార్ రావడంతో దేశభక్తిని మరోసారి చాటుకున్నారు. ఈ విజయం భారతీయ సినిమాకి చెందుతుందని చెప్పకనే చెప్పారు.