ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధ సెంచరీతో మెరిశాడు. ఢిల్లీ బౌలర్లలో సకారియా, నోర్జే, మార్ష్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మరి ఈ మ్యాచులో ఢిల్లీ గెలుస్తుందో లేదో కాసేపట్లో తేలనుంది.