ఆసక్తికర పోరులో రాజస్థాన్ విజయం

ఐపీఎల్‌లో భాగంగా నేడు రాజస్థాన్, ముంబై మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణిత ఓవర్లలో 193 పరుగులు చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైలో ఇషాన్ కిషన్(54), తిలక్ వర్మ(61), కిరణ్ పోలార్డ్(22) రాణించినా ఫలితం లేకుండా పోయింది. అటు రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ తీసుకోగా.. నవదీప్ సైనీ, చాహల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

Exit mobile version