కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. కాంతార చిత్రం తనకు గూస్బంప్స్ ఇచ్చిందని ట్వీట్ చేశారు.హీరోగానే కాకుండా ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు అయిన రిషబ్ శెట్టిని రజనీ అభినందించారు. కాంతార ఇండియన్ సినిమాలో మాస్టర్‌పీస్ అని, మొత్తం టీమ్‌కి తన అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో సప్తమి గౌడ కథానాయికగా నటించగా, హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కాంతారపై రజనీ ప్రశంసల వర్షం
