సూపర్‌స్టార్ రజినీకాంత్ నేడు చెన్నైలో నిర్వహించిన ‘హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన రజనీ జీవితంలో నాకు ఇంత పేరుప్రతిష్ఠలు, ఆస్తులు ఉన్నప్పటికీ తాను సంతోషంగా లేనని అన్నారు. సిద్ధులకు ఉన్న ప్రశాంతతలో నాకు పది శాతం కూడా లేదు. ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదు. నా కెరీర్లో ఇన్ని చిత్రాల్లో నటించినప్పటికీ నాకు బాబా, రాఘవేంద్ర సినిమాల్లో నటించిన తృప్తి ఎక్కడా రాలేదని చెప్పాడు. హిమాలయ పర్వతాలు కేవలం మంచుకొండలు కావని అక్కడ అద్భుతమైన మూలికలు లభిస్తాయని అన్నారు. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇంత ఫేమ్, డబ్బు ఉన్నప్పటికీ నేను సంతోషంగా లేను: రజినీకాంత్

© ANI Photo