మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టయిన పెరారివాలన్కు బెయిల్ దొరికింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరారివాలన్ 32ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు. అయితే, తనను విడుదల చేయాలంటూ వేసిన పిటిషన్ పై గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని గవర్నర్ ను ప్రశ్నించింది. అతని ఆరోగ్య పరిస్థితి, ఇప్పటికే 32 సంవత్సరాలు అనుభవించిన శిక్షను పరిగణనలోకి తీసుకొని.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులను సంప్రదించకుండా స్వగ్రామాన్ని వదిలివెళ్లకుండా ఉండేలా ప్రతి నెలా స్థానిక పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేయాలంటూ సుప్రీంకోర్టు షరతులు విధించింది.