కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసి ఎన్డీఏ తరఫున పోటీలో ఉండే రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ లేకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ తో కూడా రాజ్నాథ్ మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బీజేపీ చీఫ్ నడ్డా కూడా ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు మొదలు పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే దాని మీద నిర్ణయం తీసుకోలేదని.. వచ్చే సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
-
© File Photo
-
© File Photo