రాజ్యసభలో ఖాళీ అయిన, ఖాళీ కానున్న స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 15 రాష్ట్రాలకు సంబంధించిన 57 మంది ఎంపీల పదవీకాలం జూన్ 21 నుంచి ఆగష్టు 1వ తేదీ వరకు ముగియనుండగా.. వారి స్థానాల్లో కొత్త ఎంపీలు రానున్నారు. ఈ 57 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి నలుగురు ఎంపీలు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.