తెలంగాణలో ఎన్నికల నగారా మోగబోతుంది. మే 30వ తేదీన ఏకైక రాజ్యస భ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి రాజీనామా చేయడంతో.. ఈ ఖాళీ ఏర్పడింది. నామినేషన్ల దాఖలు కోసం మే 19 చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 30నే ఎన్నికల కౌంటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ సీటుకోసం యాక్టర్ ప్రకాశ్ రాజ్ ను టీఆర్ఎస్ బరిలోకి దించనుందని సమాచారం. ప్రకాశ్ రాజ్ తరుచూ బీజేపీ పార్టీ విధానాలను, ప్రధాని మోదీని విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.