సికింద్రాబాద్‌లో నిన్న జరిగిన అల్లర్లలో వరంగల్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు అతని అంతిమ యాత్ర నిర్వహించగా.. దానికి TRS పార్టీ జండాను కప్పడం వివాదాస్పదమైంది. దీనితో పాటు అంతిమ యాత్రలో వచ్చిన వాళ్లకు టీఆర్ఎస్ డబ్బులు పంచిందని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా ఆ డబ్బుల పంపిణికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.300 ఇస్తామని చెప్పి రూ.200 ఇచ్చారని అంతిమ యాత్రకు వచ్చిన మహిళలు మాట్లాడుకుంటుండడం వైరల్‌గా మారింది. దీంతో TRS పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.