ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా బర్త్‌డే పార్టీ సందర్భంగా నిన్న ముంబయిలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పార్టీలో మెరిశారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఆమె వెంట బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.