నేడు ప్రపంచవ్యాప్తంగా RRR ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఉదయం హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్లో రామ్ చరణ్, రాజమౌళి కుటుంబసభ్యులతో కలిసి మూవీ చూశారు. చరణ్, ఉపాసనతో పాటు ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూశాడు..రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ అందరూ చిత్రాన్ని వీక్షించారు.