రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారింది. దీంతో ఆ దేశం విధ్వంసాన్ని చూస్తోంది. ఈ క్రమంలో మెగా హీరో రామ్ చరణ్ ఓ విషయం పంచుకున్నారు. ఉక్రెయిన్లో RRR మూవీ నాటు నాటు సాంగ్ షూటింగ్లో ఉన్నప్పుడు చరణ్ తన బాడీగార్డ్లలో ఒకరికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపాడు. యుద్ధం నేపథ్యంలో తనకు భద్రత కల్పించిన అతనితో చరణ్ మాట్లాడాడు. తాను, తన 80 ఏళ్ల తండ్రి సైన్యంలో చేరుతున్నట్లు రస్టీ చెప్పాడు. ఈ క్రమంలో అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నట్లు చెర్రీ పేర్కొన్నాడు. దీంతో రస్టీ నిత్యావసరాలు, మందులు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత చరణ్ కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియోలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.