RRR గ్రాండ్ సక్సెస్తో ఖుషీగా ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు విమర్శకులు, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక గ్యాప్ లేకుండా వెంటనే మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాతో, మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చరణ్. ఇది ఏప్రిలో 29న రిలీజ్అవుతుంది. ఈ సినిమాలో మొదట 15 నిమిషాల పాత్ర కోసం చరణ్ అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత నిడివిని పెంచారట. దీంతో మెగా ఫ్యాన్స్ తండ్రి కొడుకులను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.